నెల్లికుదూరు: ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది.. అనిల్

నెల్లికుదూరులో రాజ్యాధికార పార్టీ యువ నాయకుడు వరిపల్లి అనిల్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై శనివారం విమర్శలు గుప్పించారు. బీసీలకు 42% రిజర్వేషన్ హామీని కేవలం స్థానిక సంస్థలకే పరిమితం చేసి మోసం చేస్తోందని ఆరోపించారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో పూర్తిస్థాయి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీలను మోసం చేసిన ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలుస్తుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్