గూడూరు: అంగన్వాడీ కేంద్రంలో బతుకమ్మ వేడుకలు

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురం పరిధిలోని రాముతండా అంగన్వాడీ కేంద్రంలో శనివారం సూపర్వైజర్ మంజుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెక్టార్ పరిధిలోని 20 మంది టీచర్లు రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. సహచర టీచర్లతో కలిసి బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సూపర్వైజర్ మంజుల తెలిపారు.

సంబంధిత పోస్ట్