గూడూరు: వృద్ధురాలిని కన్న కొడుకులకు అప్పగించిన పోలీసులు

మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతి పేటలో వృద్ధురాలు భద్రమ్మను కన్న కొడుకులు రైతు వేదిక వద్ద వదిలేసిన విషయం తెలిసిందే. గురువారం విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక ఎస్సై గిరిధర్ రెడ్డి ఆదేశాలతో భద్రమ్మ కన్న కొడుకులను హెచ్చరించారు. పోలీసుల కౌన్సిలింగ్ తో కన్నతల్లిని తీసుకెళ్లడానికి కొడుకులు ఒప్పుకున్నారు. మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్