పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ చేస్తూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా ఇవ్వాలని ఆర్డినెన్స్ చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ లో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి దనసరి అనసూయ సీతక్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు