మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల ప్రజలకు ఈనెల 04. 11. 2025 నుండి 15. 11. 2025 వరకు మహబూబాబాద్ కోర్టులో మెగా స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీ పడే కేసులు ఉంటే రాజీపడి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.