కొత్తగూడ: గునుగు పువ్వు కరువాయే బంతి పువ్వు భారమాయె

ఒకప్పుడు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఏజెన్సీ ప్రాంతంలో బతుకమ్మ పండుగ కోసం గునుగు పూలను బస్తాల కొద్దీ వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలకు తరలించేవారు. అయితే, ఈసారి బతుకమ్మ పండుగ సమీపిస్తున్నా గునుగు పూలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీనిని అదనుగా చేసుకున్న బంతిపూల వ్యాపారులు ధరలను విపరీతంగా పెంచడంతో బతుకమ్మ పండుగ నిర్వహణ ప్రియంగా మారింది.

సంబంధిత పోస్ట్