కొత్తగూడ: హడావుడి గా సీసీ రోడ్డు పనులు

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మంజూరైన సీసీ రహదారుల పనులు చేయకుండానే కొన్ని గ్రామాల్లో బిల్లులు విడిపించుకున్నారని సోమ, మంగళవారాల్లో నిర్వహించిన సామాజిక తనిఖీల్లో బహిర్గతమైంది. ఈజీఎస్ లో మంజూరైన సీసీ రోడ్లు పనులు చేయకుండానే నిధులు విడుదల చేసుకున్నట్లు వెల్లడైంది. దీంతో రేన్యతండాలో బుధవారం హడావుడిగా అధికారుల పర్యవేక్షణ లేకుండానే సీసీ రహదారి నిర్మించారు.

సంబంధిత పోస్ట్