మహబూబాబాద్ జిల్లాలో లంబాడీల ఆత్మీయ సభకు భారీగా తరలివచ్చిన లంబాడీలు, ఎస్టి జాబితా నుంచి తొలగించాలనే కుట్రలపై తిప్పికొడుతూ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో లంబాడీల హక్కుల పరిరక్షణకు, వారిని ఎస్టీ జాబితాలో కొనసాగించడానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, లంబాడీలను అణగదొక్కే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు.