మహబూబాబాద్: బొలెరో వాహనం బోల్తా.. వ్యక్తి మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బురహాన్‌పురం గ్రామ శివారులో జాతీయ రహదారి 365పై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుభకార్యంలో క్యాటరింగ్ చేసేందుకు బొలేరోలో బయల్దేరిన 25 మంది యువకులు ప్రయాణిస్తుండగా వాహనం అతివేగంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో మాలోతు పవన్(20) మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మద్యం సేవించి వాహనం నడిపారని బంధువులు ఆరోపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్