మహబూబాబాద్: రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దే

మహబూబాబాద్ జిల్లాకు అన్ని సంక్షేమ పథకాల్లో పెద్ద పీట వేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబాబాద్ లో జరిగిన సభలో మాట్లాడుతూ అన్ని వర్గాల పోరాట ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రతి పేదవాడికి సహాయం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ ఆశయమన్నారు. రైతుకు రుణమాఫీ, వడ్లకు బోనస్ ఇచ్చి రైతును రాజును చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.

సంబంధిత పోస్ట్