పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలోని సన్నూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యూత్ సీనియర్ నాయకులు, ఎర్రబెల్లి దయాకర్ రావు వీరాభిమాని చీకటి రవి అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి పార్దివదేహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం చేశారు.