మహబూబాబాద్ కలెక్టరేట్లో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పూలతో అలంకరించిన రెవెన్యూ శాఖ బతుకమ్మ మొదటి అవార్డును, మెప్మా రెండవ అవార్డును, సెర్ప్ శాఖ బతుకమ్మలు అవార్డులను అందుకున్నాయి. ఈ అవార్డులను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ చేతులమీదుగా అందజేశారు.