బతికుండగానే మార్చురీకి.. వైద్యుల నిర్లక్ష్యంపై లోకాయుక్త విచారణ

మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో అక్టోబరు 30న, చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు (39) అనే వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున చనిపోయారు. అయితే, మార్చురీలో సజీవంగా ఉన్న రాజును గుర్తించిన వైద్యులు వెంటనే ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. ఆధార్‌కార్డు లేదని మొదట చేర్చుకోలేదని, రెండు, మూడు రోజులు ఆసుపత్రి ఆవరణలోనే సంచరించారని తెలిసింది. ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి విచారణకు ఆదేశించగా, లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది. ప్రాథమిక విచారణలో మార్చురీ సూపర్‌వైజర్, సెక్యూరిటీ గార్డును తొలగించారు. గురువారం చేర్చుకొని లివర్, ఊపిరితిత్తులు, క్షయ, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు నిర్ధారించి చికిత్స అందించారని, చికిత్సలోనే మృతిచెందారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్