ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర వాహనాలకు టోల్ మినహాయింపుపై ఆసక్తి చూపకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతర ముగిసే వరకు టోల్ మినహాయింపు ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.