సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటిడిఎ కార్యాలయం వద్ద ఆదివాసీ సంఘాల నాయకులు ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముట్టడి సమాచారం అందుకున్న పోలీసులు ఐటిడిఎ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ 163వ జాతీయ రహదారిపై ఆదివాసీలు బైఠాయించి నిరసన తెలిపారు.