ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటిడిఎ ముట్టడికి తెలంగాణ ఆదివాసి ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సోమవారం పిలుపునిచ్చింది. ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని, రాజ్యాంగంలోని 342(2) నిబంధనలను ఉల్లంఘించి ఎస్టీ జాబితాలో చేరిన లంబాడాల రిజర్వేషన్లను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వై జంక్షన్ నుండి ఐటిడిఎ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.