ములుగు: విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి

ములుగు మండలం సారంగపల్లిలో గురువారం విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు అజ్మీరా అనిల్ కుమార్ కు చెందిన గేదె మేతకు వెళ్ళినప్పుడు కరెంట్ స్తంభం వద్ద ఎర్త్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ. 60వేల నష్టం జరిగినట్లు తెలిపారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అటువైపు మనుషులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత గేదెను తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్