ములుగు: తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య

తండ్రి మందలించడంతో పురుగు మందు తాగి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో జరిగింది. వాజేడు మండలం మండపాక గ్రామానికి చెందిన అరవింద్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కాగా బుధవారం తండ్రి బతుకయ్య ఇంటి పని చేయట్లేదు, ఇంటిని పట్టించుకోవట్లేదని అరవింద్ ను మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. హస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడని ఎస్సై హరీష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్