ములుగు: నేడు మల్లంపల్లి బ్రిడ్జిపై రాకపోకలు బంద్

ములుగు జిల్లా మల్లంపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద జాతీయ రహదారి బ్రిడ్జి నిర్మాణం కారణంగా బుధవారం రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ హైవే ఏఈ చైతన్య తెలిపారు. హనుమకొండ వైపు వెళ్లే భారీ వాహనాలు అబ్బాపూర్ మీదుగా, చిన్న వాహనాలు భూపాల్ నగర్ మీదుగా మళ్లించబడతాయి. హనుమకొండ నుంచి వచ్చే భారీ వాహనాలు గూడెప్పాడ్, పరకాల మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు. వాహనదారుల సహకారం కోరారు.

సంబంధిత పోస్ట్