ములుగు జిల్లా కేంద్రంలో సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రూ. 25 కోట్ల వ్యయంతో 8 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ పనులను ఇటీవల మంత్రి సీతక్క, ఎంపీలు బలరాం నాయక్, నగేష్ ప్రారంభించారు. ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఫిల్లర్లు, సిమెంట్ ఇటుకలతో గోడ నిర్మాణం జరగనుంది. అవసరమైన సెంట్రింగ్ పనులు, తాత్కాలిక కాంక్రీట్ ప్లాంట్లు సిద్ధం చేశారు.