వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం రెడ్లవాడ, పిట్ట కలబోడు తదితర ప్రాంతాల్లో ఇటీవల మొంత తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం పరిశీలించారు. పంట నష్టం వివరాలను కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ దుడిమెట్ల కొమురయ్య, అధికారులు వివరించారు.