మొంథా తుపాను వల్ల వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం వరంగల్ జిల్లా ఖానాపురం తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. మండల పార్టీ అధ్యక్షుడు వేములపల్లి ప్రకాశ్రరావు మాట్లాడుతూ, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 25 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.