నర్సంపేట: స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని వినతి

వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మంగళవారం నిరసన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి, ప్రభుత్వం తాత్సారం చేయకుండా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, సాగర్, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్