వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం పెన్సిల్ (లెడ్) మొనను దీపపు ప్రమిదలా చెక్కి, అందులో నూనెతో కూడిన వత్తిని వేసి వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్తీక మాసంలో గుళ్ళు గోపురాలు సందర్శించే సమయంలో భక్తులు ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా సంయమనం పాటిస్తూ తమ భక్తిని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు.