నర్సంపేట పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని నిరసన తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న 800 కోట్ల రూపాయలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.