జనగామ జిల్లా పాలకుర్తిలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండపై వెలిగించే అఖండ జ్యోతి దర్శనం కోసం శనివారం ప్రచార రథాలను ఆలయ పర్యవేక్షకులు కొత్తపల్లి వెంకటయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకుడు దేవగిరి లక్ష్మన్న శర్మ, అర్చకులు డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.