జనగామ జిల్లా పాలకుర్తిలో అనాథ అయిన లక్ష్మీ (50) అనారోగ్యంతో మృతి చెందగా, సేవ్ పాలకుర్తి ఫోరం ఆధ్వర్యంలో మానవత్వం చాటుతూ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటాచారి సమాచారం మేరకు, ఫోరం ప్రతినిధులు, జర్నలిస్టు బండిపెల్లి మధు, ప్రధాన కార్యదర్శి దుంపల సంపత్, దేవసాని సురేష్ లు లక్ష్మీ అంత్యక్రియలను పూర్తి చేశారు.