మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు పంచాలని సీపీఎం పార్టీ శనివారం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీలో అన్యాయం జరుగుతోందని పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు.