పరకాలలో ఆంధ్ర దొంగల ముఠా

హనుమకొండ వెళ్ళడానికి పరకాల బస్ స్టాండ్ లో బస్ కోసం ఎదురుచూస్తున్న రవ్వ కావ్య అనే మహిళ వద్ద నుంచి గుర్తుతెలియని దొంగలు ఆమె పర్సు, మొబైల్ ఫోన్ చోరీ చేశారు. ఈ ఘటనపై పరకాల పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారిపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తేలింది. అనంతరం వారిని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్