సంగెం మండల కేంద్రంలో, బిక్కోజి నాయక్ తండ గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని ఆయన అన్నారు.