గీసుగోండ మండలం నంద నాయక్ తండ, దశ్రు తండా గ్రామపంచాయతీ పరిధిలోని సింగ్య తండా గ్రామాల్లో గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ లను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విద్యుత్ సౌకర్యం కీలకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.