బిక్కోజి నాయక్ తండా గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గ్రామ ప్రజలు, ఐటీడీఏ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, రోడ్డు మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.