శనివారం పరకాల పట్టణంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. భూపాలపల్లి నుంచి పరకాలకు వస్తున్న ఆర్టీసీ బస్సుకు కారు రాసుకోవడంతో డ్రైవర్ బ్రేక్ వేయగా, వెనుక వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.