ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలోని గీసుగొండ మండలం ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం రెండో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనాచార్యులు, శ్రీహర్ష స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, పుట్టలో పాలు పోసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కమిటీ సభ్యులు, గ్రామస్థులు కూడా పాల్గొన్నారు.