కార్తీక పౌర్ణమి సందర్భంగా రేగొండ మండలం తిరుమలగిరి శివారులో బుగులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు కూర్మచలం వెంకటేశ్వర్లు ఇంట్లో స్వామి వారి ఉత్సవ విగ్రహలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంలో బుగులోని గుట్ట వద్దకు తీసుకెళ్లి, ఇప్పచెట్టు చుట్టూ రథాన్ని తిప్పారు. ఈ ఉత్సవాలు ఏటా జరుగుతాయి.