చాగల్ లో విద్యుత్ షాక్ తో మహిళ మృతి

జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం చాగల్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరడంతో విద్యుత్ షాక్ తగిలి బూర్ల రజిత (35) అనే మహిళ మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం, వర్షపు నీరు విద్యుత్ పరికరాలతో కలిసి ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్