కార్తీక పౌర్ణమి సందర్భంగా వరంగల్ నగరంలోని శైవ క్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖిలావరంగల్ స్వయంభు దేవాలయం, భద్రకాళి గుడిలో భద్రేశ్వరుల ఆలయం, కాశిబుగ్గ కాశీ విశ్వేశ్వర ఆలయాల్లో శివునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. దీంతో నగరంలోని శివాలయాలన్నీ భక్తుల శివనామ స్మరణతో మారుమోగాయి.