వారం రోజులు గడవక ముందే వరంగల్ నగరంలో మళ్లీ భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. గతంలో కురిసిన వర్షాలకు ఇంకా తేరుకోకముందే ఈ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. డ్రైయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో, బల్దియా సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.