వరంగల్: రోడ్డు ప్రమాదంలో రాజేందర్ మృతి

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లునావత్ రాజేందర్ (43) అనే వ్యక్తి మృతి చెందాడు. రాజేందర్ తన భార్యతో కలిసి నర్సంపేట నుండి తిరిగి వస్తుండగా, ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి, అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రావుల రణధీర్రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్