వరంగల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. వరంగల్, హన్మకొండ మార్కెట్లోని దారుల్లో వర్షపు నీరు నిలిచింది. హంటర్ రోడ్డు సమీపంలో, కరీంబాద్ రైల్వే అండర్ బ్రిడ్జి వరద నీరు ప్రవహించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.