రైతులకు న్యాయమైన ధర కల్పించాలి.. ఎమ్మెల్యే

రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే అమ్మి సముచితమైన ధర పొందాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పిలుపునిచ్చారు. నెక్కొండ మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ సత్య శారదలు ఆదివారం ప్రారంభించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్