హన్మకొండ: వరదలో కొట్టుకొచ్చిన వ్యక్తి మృతదేహం

ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని చెరువులో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో కొట్టుకొని వచ్చి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుడు చామన ఛాయతో, నీలి రంగు ప్యాంట్‌, బూడిదరంగు టీషర్ట్‌ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్