పలు కాలనీ లలో ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పర్యటన

గోపాలపురం చెరువు కోతకు గురై టీఎన్జీవోస్ కాలనీ, వెంకటేశ్వర నగర్, జవహర్ నగర్ కాలనీలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్థానిక కార్యకర్తలతో కలిసి కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నీరు చేరిన ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా నీటిని తొలగించి ప్రజలు ఇళ్లకు తిరిగి వెళ్లే పరిస్థితులు కల్పించాలని మున్సిపల్ అధికారులకు ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్