తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు స్టాలిన్ మంద శ్రీకాంత్ అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసు ను ముట్టడించారు. విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, 3 సంవత్సరాలుగా 150 కోట్ల రూపాయల వరకు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందని వారు ఆరోపించారు.