ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి: విద్యార్థుల నిరసన

హన్మకొండలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని, ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇటీవల కురిసిన వర్షాలకు మెస్సు కరాబైనప్పటికీ ఎమ్మెల్యే సందర్శించకపోవడం దురదృష్టకరమని, ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్