మోంథా తుఫాన్: ముదిరాజులకు భారీ ఆర్థిక నష్టం, పరిహారం కోరిన సంఘం

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో మోంథా తుఫాన్ ముదిరాజులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించింది. చెరువుల్లో చేపలు నష్టపోవడంతో పాటు, జాలీలు వరద నీటిలో కొట్టుకుపోయాయని మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రావుల రాజు తెలిపారు. తుఫాన్ వల్ల అన్ని గ్రామాల్లో ముదిరాజులకు అపార నష్టం జరిగిందని, నష్టాన్ని అంచనా వేసి మత్స్యశాఖ ద్వారా తగిన పరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సంబంధిత చెరువులను పరిశీలించి, నష్టపోయిన ప్రతి ముదిరాజ్ సొసైటీకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్