కాజీపేట మండలం 44 డివిజన్ పరిధిలోని బట్టుపల్లి గ్రామంలో ఆదివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నూతనంగా ప్రతిష్టించిన బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి నార్ల గిరి కుమారస్వామి, ఉప్పుల నవీన్ యాదవ్, పెనుకుల వినయ్ తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.