వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామ శివారులో వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. గ్రామ ఎల్లమ్మ చెరువు నిండి మత్తడి పోయడంతో ఉప్పరపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. హన్మకొండ డిపోకు చెందిన బస్సు నల్లబెల్లి నుంచి ఉదయం వరంగల్ వెళ్తుండగా రోడ్డు కయ్యకోసి బస్సు టైరు దిగబడింది. అదృష్టవశాత్తు 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.