అనేక దేశాల్లో ఆయుధ ఫ్యాక్ట‌రీల‌ను నిర్మించాం: ఇరాన్ ర‌క్ష‌ణ మంత్రి

అనేక దేశాల్లో ఆయుధ ఫ్యాక్ట‌రీల‌ను నిర్మించామ‌ని ఇరాన్ పేర్కొంది. అయితే, ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. క్షిపణి అభివృద్ధిపైనే తమ సైన్యం దృష్టి సారించిందని ఇరాన్‌ రక్షణ మంత్రి అజీజ్‌ నజీర్జాదే తెలిపారు. ఇటీవల ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో అత్యాధునిక క్షిపణులను వాడలేదన్నారు. 12 రోజుల యుద్ధం ముగిసిపోకుంటే.. తమ క్షిపణులను ఇజ్రాయెల్‌ దళాలు అడ్డుకోలేకపోయేవని చెప్పారు.

సంబంధిత పోస్ట్