TG: రాష్ట్ర ఎక్సైజ్ అకాడమీలో గ్రూప్స్ సర్వీసుల ద్వారా ఎంపికైన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ ఎస్సైలకు శిక్షణ ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణ కాలంలో చట్టంపై మంచి పట్టు సాధించి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు పిలుపునిచ్చారు. లక్షలాది మంది పోటీపడిన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులను చూసి సంతోషం వ్యక్తం చేశారు.